- జిల్లా వైద్యాధికారి డా.రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజలకు టీబీపై అవగాహన కలిగించేందుకు అన్ని విభాగాలు సహకరించాలని జిల్లా వైద్యాధికారి డా.రాజశ్రీ సూచించారు. జిల్లా టీబీ ఫోరం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీబీ నిర్ధారణ, చికిత్స, న్యూట్రిషన్ సపోర్ట్ కోసం ప్రతి నెలా రూ.1000 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి జిల్లా టీబీ ఫోరం సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్, పంచాత్ రాజ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ పుల్మనరీ విభాగం ప్రొఫెసర్, వివిధ ఎన్జీఓ సభ్యులు, ఎన్టీఈపీ, జడ్పీ ఆఫీస్ ఏఓ భరత్, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డా.దేవి నాగేశ్వరి, ఐఎంఏ ప్రెసిడెంట్ డా.ఏ.శ్రీనివాస్, డా. ప్రశాంత్, నరేష్ జిల్లా టీబీ కోఆర్డినేటర్, వివిధ ఎన్జీఓ సభ్యులు హెల్త్ ఉద్యోగులు పాల్గొన్నారు.
