Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 5:45 pm Posted by : ramakrishna

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

  • నిజామాబాద్ సీపీ సాయి చైతన్య

 

రుద్రూర్, బతుకమ్మ : సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అధికారులకు సూచించారు. జిల్లాలోని రుద్రూర్ , కోటగిరి , వర్ని పోలీస్ స్టేషనులను శనివారం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్లను మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ల  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.  5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని మొత్తం చూసారు.)వాహనాల పార్కింగ్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.  సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.  గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.  ఈ సందర్బంగా బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్ ,  రుద్రూర్ ఎస్ఐ పి. సాయన్న , వర్ని ఎస్ఐ యు. మహేష్, కోటగిరి పీఎస్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ల సిబ్బంది  పాల్గొన్నారు.

Awareness should be created about cyber crimes.