Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 January 2025, 5:02 pm Posted by : ramakrishna

రేపు అవగాహన సదస్సు

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో శుక్రవారం  మత్స్యశాఖ సహకార సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు సోన్ పేట మత్స్య సహకార సంఘం అధ్యక్షులు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశలో భాగంగా బాల్కొండ, ముప్కాల్, ఏర్గట్ల,మెండోరా నాలుగు మండలాల మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఉదయం 10:30 గంటలకు జరిగే సదస్సులో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో సొసైటీల నిర్వహణ, వాటి లావాదేవీలు, సొసైటీల తీర్మానాలు, ప్రభుత్వం మత్స్యకారులకు కల్పిస్తున్న పథకాలు వాటి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు.