పాఠశాలలో మహిళ సాధికారతపై అవగాహన సదస్సు

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల పరిధిలోని చంద్రాయనపల్లి ఎంపీపీ యూపీఎస్ పాఠశాలలో గర్ల్ చైల్డ్ అండ్ మహిళా సాధికారతపై శనివారం ఎస్సై సందీప్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సందీప్ మాట్లాడుతూ మహిళా సాధికారత సమాజ అభివృద్ధికి అత్యంత అవసరమని తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యారంగంలో సాధికారత సాధించి తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని అవగాహన కల్పించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, ఇంట్లో కానీ...