Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 7:58 pm Posted by : ramakrishna

పాఠశాలలో మహిళ సాధికారతపై అవగాహన సదస్సు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల పరిధిలోని చంద్రాయనపల్లి ఎంపీపీ యూపీఎస్ పాఠశాలలో గర్ల్ చైల్డ్ అండ్ మహిళా సాధికారతపై శనివారం ఎస్సై సందీప్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సందీప్ మాట్లాడుతూ మహిళా సాధికారత సమాజ అభివృద్ధికి అత్యంత అవసరమని తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యారంగంలో సాధికారత సాధించి తమ కాళ్లపై తాము నిలబడాలని సూచించారు. అలాగే సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎదుర్కోవాలని అవగాహన కల్పించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, ఇంట్లో కానీ ఆడపిల్లలు లేదా మహిళలపై ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని లేదా 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. అదే విధంగా సైబర్ క్రైమ్‌పై అవగాహన, మహిళల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, సైబర్ సెక్యూరిటీ అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సందీప్, ప్రిన్సిపాల్ తిరుపతి, గ్రామ సర్పంచ్ ఆరేటి రఘు, ఉపాధ్యాయ బృందం మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.