మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు

  నందిపేట్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నందిపేట్ ఎస్ఐ కె. వినయ్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారం గ్రామంలో యువకులకు మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువతకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు మానవ శరీరానికి, మెదడుకు తీవ్రమైన హాని కలిగించే రసాయనాలని పేర్కొన్నారు. వీటి వినియోగం వల్ల గుండె, కాలేయం, మూత్రపిండాలు...