నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా ఐ డి ఓ సి సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన డి ఎల్ పి ఓ లు, ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ లకు సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఆర్ పై వివరిoచిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింతియాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు గుండె జబ్బుల ద్వారానే అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ కార్డియో పల్మనరీ రీసెర్సిటేషన్ పై అవగాహన పెంచుకొని అత్యవసర సమయంలో మన తోటి వారికి కార్డియా కరెస్టు నుండి సిపిఆర్ చేసి, అంబులెన్స్ ద్వారా దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు నిలబెట్టొచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పోషకాహారం తీసుకుంటూ ఉప్పును తగ్గించాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, జీవనశైలి మార్పుల ద్వారానే జీవన శైలి వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి డిప్యూటీ సీఈవో సాయన్న, హౌసింగ్ ఎఇ పవన్, ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సామ్రాట్ యాదవ్, పాల్గొన్నారు.
