Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 8:25 pm Posted by : ramakrishna

ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి పట్టణంలో నడిపిస్తున్న ఆటో డ్రైవర్లకు సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిలో భాగంగా కామారెడ్డి డి.ఎస్.పి నాగేశ్వరావు ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మై ఆటో ఈజ్ సేఫ్  అనే అంశంపై ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా ఆటోకు ఉండాల్సిన కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండడం వాటిపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ సీఐ, ఎస్ఐలు, సిబ్బంది, ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు.