గోవింద్ పేట్ గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీ  

  ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్య హక్కు పరిరక్షణ, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించే లక్ష్యంతో డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, చైల్డ్ లేబర్ ప్లాట్‌ఫారం  సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించి, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు.పిల్లలను పనుల్లోకి కాకుండా పాఠశాలల్లో చేర్పించి వారి విద్యాభ్యాసానికి...