డ్రగ్స్ కు వ్యతిరేకంగా బోధన్‌లో అవగాహన ర్యాలీ
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి బోధన్ బస్టాండ్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. "మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు", "డ్రగ్స్‌కు బానిసలుకాకండి", "జీవితాన్ని వెలుగు బాటలో నడిపించండి" అనే నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల మత్తు మనిషిని మానవత్వం నుండి దూరం చేస్తుందని,...