Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 June 2025, 4:32 pm Posted by : ramakrishna

డ్రగ్స్ కు వ్యతిరేకంగా బోధన్‌లో అవగాహన ర్యాలీ

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి బోధన్ బస్టాండ్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. “మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు”, “డ్రగ్స్‌కు బానిసలుకాకండి”, “జీవితాన్ని వెలుగు బాటలో నడిపించండి” అనే నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… మాదకద్రవ్యాల మత్తు మనిషిని మానవత్వం నుండి దూరం చేస్తుందని, యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీడిపీవో పద్మ, సీఐలు వెంకట నారాయణ, విజయ్ బాబు, ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు, విద్యావికాస్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, సంఘసంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.