చైల్డ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గురువారం చైల్డ్ సేఫ్టీ అంశంపై మూడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మాక్లూర్ మండలంలోని గంగారమంద గ్రామంలో మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల...