నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన “విద్యావారోత్సవాల్లో” భాగంగా మూడవ రోజు బుధవారం డిగ్రీ కోర్సులు, ప్రవేశాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయకర్త డాక్టర్ కె.రంజిత ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్పొరేటర్లు, పురప్రముఖులు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యార్థులకుఉన్నత విద్యలో ఉపాధి ఉద్యోగ కల్పనకు తగినట్లుగా డిగ్రీ కోర్సులలో తెస్తున్న మార్పులు, తదితర ప్రత్యేకంశాలపట్ల అవగాహన కలిగించారు.

దోస్త్ 2026-27ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులను చేర్చి, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేసుకుంటే విద్యావ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థుల పురోగతి తదితర అంశాలను అధ్యాపకులు దండుస్వామి, రామస్వామి, రామకృష్ణ, రమేష్ గౌడ్, ముత్తెన్న, రాహుల్, మొబినుద్దీన్ తదితరులు వివరించారు. కళాశాలలో ప్రస్తుతం 10 పీజీ కోర్సులు కూడా కొనసాగుతున్నాయని, మరిన్ని పీజీ కోర్సులు మంజూరు కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, ఏ.వో. రామ్ కిషన్, అధ్యాపకులు, రాజేశ్, వినయ్ కుమార్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
