మాదకద్రవ్యాల నిరోధానికి అవగాహన కార్యక్రమాలు
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ నిజామాబాద్, బతుకమ్మ : మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఈ దిశగా ఇప్పటికే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో నిజామాబాద్ జోన్ పరిధిలో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను అందిస్తున్నాయని అన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వీలుగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులు, కరపత్రాలను...