Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 6:30 pm Posted by : ramakrishna

వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం

 

మాచారెడ్డి, బతుకమ్మ :

 

వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ ఉపయోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలపై శనివారం పోలీస్ కళా బృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం, మాచారెడ్డి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ గౌడ్ సూచన మేరకు మాచారెడ్డి చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటీపీ లు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ నేరాల కై టోల్ ఫ్రీ నం 1930 కి కాల్ చేయాలని సూచించారు. అలాగే అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయాలని, మహిళలకు రక్షణగా షి టీమ్ ఉందని తెలిపారు. పోలీస్ కళాబృందం ఇన్ చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, పీసీ లు ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్  లక్ష్మిరాజాం బ్లూ కోట్స్ పీసీ నర్సయ్య, వివిధ ప్రాంతాలకు వెళ్లె ప్రయాణికులు పాల్గొన్నారు.