సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్ పై అవగాహన కార్యక్రమం బ్రోచర్ ఆవిష్కరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న “సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్” అనే అవగాహన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఎం. యాదగిరి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ యువత, విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ ఫర్ మెషన్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం సమన్వయంతో...