Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 4:59 pm Posted by : ramakrishna

సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్ పై అవగాహన కార్యక్రమం బ్రోచర్ ఆవిష్కరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న “సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్” అనే అవగాహన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను మంగళవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి  టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఎం. యాదగిరి సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ యువత, విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ ఫర్ మెషన్ బ్యూరో, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం సమన్వయంతో నిర్వహిస్తున్నారు. “వార్తాలాప్” కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడనున్న ఈ అవగాహన కార్యక్రమం మార్చి 25 న ఉదయం 10 గంటలకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం డైరెక్టర్‌గా ప్రొఫెసర్ జి. రాంబాబు, ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వ్యవహరిస్తుండగా, కన్వీనర్‌గా డా. ఎన్. స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి), ఇంగ్లీష్ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, యూనిట్-3 బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆడిసిన్ డైరెక్టర్ గంటా చంద్రశేఖర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంపత్ కుమార్, రవీందర్ రెడ్డి, డాక్టర్ సాయిలు, డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు.