కామారెడ్డి, బతుకమ్మ : అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, టీజీవోస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నిత్యజీవితంలో యోగా చేయడం ఒక భాగం కావాలన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగ సాధన తప్పనిసరిగా చేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే “ఆయుర్ చైతన్యం ఆయుర్వేద మరియు పంచకర్మ వైద్యశాల” ఓనర్ డాక్టర్ చైతన్య సురేష్ సహకారంతో యోగా శిక్షకులు యోగా సాధకులకు ప్రత్యేకంగా రూపొందించిన స్పాన్సర్డ్ టీ -షర్ట్స్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో టీఎన్జీవోస్ సహాధ్యక్షులు ఎం చక్రధర్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ గణేశ్, టీజీవోస్ సంయుక్త కార్యదర్శి నరసింహులు ,జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్, ఆయుష్ వైద్యాధికారులు డా. వెంకటేశ్వర్లు, డా. దేవయ్య, డా. విజయ, డా. చైతన్య, డా. నసీం సుల్తానా,ఆయుష్ పారామెడికల్ సిబ్బంది శ్రీనివాస్, మహమ్మద్ బైగు, కిషోర్,యోగ శిక్షకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.