విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మంగళవారం "మహిళల భద్రత, పిల్లలపై వేధింపులు, మానవ అక్రమ రవాణా వ్యతిరేకత పై అవగాహన" కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీసుశాఖ క్రైమ్ కంట్రోల్ విభాగం ఏ.సి.పి. నాగేంద్రచారి హాజరై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏ.సి.పి. నాగేంద్రచారి మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, ఘోరాలను అరికట్టి, భయం లేని, భద్రతగల సమాజం ఏర్పడాలంటే విద్యార్థులు అందరూ పోలీసులుగా మారాలన్నారు. మనం నిర్లక్ష్యం వహిస్తే, సమాజంలో...