Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 October 2025, 5:36 pm Posted by : ramakrishna

విద్యార్థులకు మహిళా భద్రతపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ఎన్.సి.సి.,  ఎన్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో  మంగళవారం “మహిళల భద్రత,  పిల్లలపై వేధింపులు, మానవ అక్రమ రవాణా వ్యతిరేకత పై అవగాహన” కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీసుశాఖ క్రైమ్ కంట్రోల్ విభాగం   ఏ.సి.పి. నాగేంద్రచారి హాజరై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా  ఏ.సి.పి. నాగేంద్రచారి  మాట్లాడుతూ  బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, ఘోరాలను అరికట్టి, భయం లేని, భద్రతగల సమాజం ఏర్పడాలంటే  విద్యార్థులు అందరూ పోలీసులుగా మారాలన్నారు. మనం నిర్లక్ష్యం వహిస్తే, సమాజంలో మరింత దారుణాలు జరుగుతాయని ఫలితంగా వివిధ ఘటనలో బాధితులుగా మిగిలిన వారు వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. చట్టాలు, ధర్మశాస్త్రాలు కూడా వ్యక్తుల ఆత్మరక్షణకే ప్రాధాన్యమిస్తున్నాయని, వాటి పట్ల అవగాన కలిగి ఉండాలని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో, బాధ్యతగల పౌరులుగా ఎదగాలి అంటే అన్ని అంశాల పట్ల లోతైన అవగాహన  పెంచుకొని ప్రవర్తించాలని సూచించారు. కళాశాలలో డిసిప్లిన్ కమిటీ, షీటీం కమిటీ, యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ కమిటీలను  ఏర్పాటు చేయడమైనదని, ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్,  అధ్యాపకుల ద్వారా నా దృష్టికి  తెవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల  వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, పీఆర్.ఓ. డాక్టర్  దండుస్వామి,   ఎన్.సి.సి. అధికారి  లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి, డాక్టర్  రంజిత, సుభాషిణి దేవి, ప్రతిభ, లావణ్య, నిఖత్ పాతిమా, ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం ఆఫీసర్స్, నాగజ్యోతి, రజిత, దస్తప్ప,నరేష్ కుమార్, శమంత, అర్చన,కళాశాల సూపరిండెంట్  ఉదయభాస్కర్, ఏ.వో. రామ్ కిషన్ మరియు పోలీసుశాఖ సిబ్బంది నరేష్ కుమార్, శ్రీనివాస్, హరిత, రేఖారాణి, శ్రీకాంత్  తదితరులు విద్యార్థులు, ఎన్.సి.సి. కెడేట్స్, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్స్ పాల్గొన్నారు.

Awareness on women's safety for students