బోధన్, బతుకమ్మ :
రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఎడపల్లి ఎస్‌ఐ రమాదేవి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ కట్టించుకొని, మోటార్ సైకిల్ దారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే సందేశాన్ని అందించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలని, హెల్మెట్ వాడకం ప్రాణాలను కాపాడగలదని ఆమె వివరించారు. పండుగలు జరుపుకుంటూనే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్‌ఐ రమాదేవి ప్రజలకు సూచించారు.