రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో రైడ్స్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థినీలకు శుక్రవారం రుద్రూర్ ఎస్సై పి.సాయన్న సైబర్ నేరాలు, మహిళల రక్షణ, రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ బృందం సభ్యులు, విద్యార్థినిలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.