చిక్కడపల్లిలో పౌర హక్కుల పై అవగాహన

  రుద్రూర్, బతుకమ్మ :   పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం పౌర హక్కుల పై అంగన్వాడి టీచర్లకు, గ్రామస్తులకు తహశీల్దార్ తారాబాయి, ఎంపీడిఓ బాల గంగాధర్ లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్డు కులాల, తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం అత్యాచారాలకు పాల్పడిన లేదా ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. షెడ్యూల్డు కులములు, షెడ్యూల్డు తెగులకు చెందిన లేదా కేటాయించిన భూములను...