క్షయ వ్యాధి లక్షణాలు, నివారణపై అవగాహన

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్ వైద్య సిబ్బందితో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా  క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వారికి ఎప్పటికప్పుడు మందులను వాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులు  తప్పకుండా నివారణ కోసం మందులు రోజువారీగా  తీసుకోవాలి. ఇంట్లోనే  కుటుంబ సభ్యులతో  మాట్లాడేటప్పుడు తుప్పుర్లు పడకుండా మొఖానికి  మాస్క్ ధరించాలి. దగ్గు,తుమ్మేటప్పుడు...