Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 2:40 pm Posted by : ramakrishna

క్షయ వ్యాధి లక్షణాలు, నివారణపై అవగాహన

నిజాంసాగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్ వైద్య సిబ్బందితో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా  క్షయ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వారికి ఎప్పటికప్పుడు మందులను వాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులు  తప్పకుండా నివారణ కోసం మందులు రోజువారీగా  తీసుకోవాలి. ఇంట్లోనే  కుటుంబ సభ్యులతో  మాట్లాడేటప్పుడు తుప్పుర్లు పడకుండా మొఖానికి  మాస్క్ ధరించాలి. దగ్గు,తుమ్మేటప్పుడు ప్రతి ఒక్కరూ ఏదైనా కర్చిప్ లాంటిది  మూతికి అడ్డు పెట్టుకొని దగ్గాలి లేదంటే అరిచేతులు  అడ్డు పెట్టుకోవాలి  అని పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వ్యాధి రాకముందే జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ఈ కార్యక్రమంలో  ఫార్మసిస్టు, వైద్యులు, వైద్య సిబ్బంది లు పాల్గొన్నారు.