ఆటోడ్రైవర్లకు  ట్రాఫిక్ నియమాలపై అవగాహన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వుల ప్రకారం ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ రావు ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డి ఎస్ ఐ బి మహేష్ ఆధ్వర్యంలో స్థానిక పరిధిలోని ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, రహదారి భద్రత, ప్రజల రక్షణకు ఆటోడ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. డ్రైవర్లు ఎల్లప్పుడూ తమ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను...