Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 4:21 pm Posted by : ramakrishna

ఆటోడ్రైవర్లకు  ట్రాఫిక్ నియమాలపై అవగాహన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వుల ప్రకారం ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ రావు ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డి ఎస్ ఐ బి మహేష్ ఆధ్వర్యంలో స్థానిక పరిధిలోని ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలను పాటించడం, రహదారి భద్రత, ప్రజల రక్షణకు ఆటోడ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. డ్రైవర్లు ఎల్లప్పుడూ తమ వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించుకోకుండా, సౌండ్ బాక్సులు పెట్టకుండా ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదు, మద్యం లేదా మత్తు పదార్థాలు వాడి వాహనం నడపరాదు, పోలీస్ తనిఖీల సమయంలో సహకరించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. సందేహాస్పద వ్యక్తులు లేదా నేర సంబంధిత సమాచారం ఉంటే వెంటనే 100 నంబర్‌ కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమం ద్వారా రహదారి ప్రమాదాలు తగ్గే దిశగా పోలీస్-ఆటోడ్రైవర్ల మధ్య సమన్వయం మెరుగుపడేందుకు ఉద్దేశించబడింది. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించి, సురక్షితమైన, శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ 2 సుబ్రమణ్య చారి, హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్ రెడ్డి కానిస్టేబుల్స్ రాజేశ్వర్ హోమ్ గార్డ్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Awareness of traffic rules for auto drivers