Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 5:24 pm Posted by : ramakrishna

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డు లో గల నలంద పాఠశాలలో పిల్లల వైద్యుల సంఘం,  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగశవారం రోడ్డు భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోడ్డు భద్రత సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టల్ ఆవిష్కరించి  విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.శ్రీశైలం మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ

Awareness of students on road safety

వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా చెప్పాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సూచించారు. వాహనదారులలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు.  ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు,రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తోట రాజశేఖర్ కోశాధికారి కరిపే రవీందర్, నలంద పాఠశాల చైర్మన్& రెడ్ క్రాస్ నిజాంబాద్ డివిజన్ వైస్ చైర్మన్ మురళి కృష్ణ , డైరెక్టర్ ఇంగు నేహా, ప్రిన్సిపల్ తనుజ, ఐఏపీ కార్యదర్శి శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

Awareness of students on road safety