మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

బతుకమ్మ, వేల్పూర్ :-పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మోతే, పడగల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో వేల్పూర్ ఎస్ఐ బి.సంజీవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలైన గంజాయి, కోకైన్, హెరాయిన్ కు బానిసలై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దనానారు.  మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మిన, కొన్న మాకు మీరు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.