Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 6:23 pm Posted by : ramakrishna

మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి  మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  మత్తు పదార్థాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ…చాలా మంది యువత చిన్న వయసులో   డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు కు బానిసలుగా మరి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు,   ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాల నిర్ములన పై అవగాహన సదస్సు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.