జీజీ కళాశాలలో పాట రచన మెళకువలపై అవగాహన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో "పాట రచన మెళకువలు" అనే అంశంపై గురువారం అతిథి ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సిని మా రంగంలో, టివి రంగంలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఎందరో గాయకులు తమ ప్రతిభ చేత సెబ్రిటీస్ అవుతున్నారని, వయసుతో సంబంధం లేకుండా గొప్పగా రాణిస్తున్నారని, ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంటున్నారని, ఆవిధంగా విద్యార్థులు మీ సామర్థ్యాలు మెరుగు దిద్దుకోవాలని అన్నారు....