Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 6:33 pm Posted by : ramakrishna

జీజీ కళాశాలలో పాట రచన మెళకువలపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కొరవి గోపరాజు  తెలుగు విభాగం ఆధ్వర్యంలో  “పాట  రచన మెళకువలు” అనే అంశంపై గురువారం అతిథి ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ.. సిని మా రంగంలో, టివి రంగంలోనే కాక సోషల్ మీడియాలో కూడా ఎందరో గాయకులు తమ ప్రతిభ చేత సెబ్రిటీస్ అవుతున్నారని,  వయసుతో సంబంధం లేకుండా గొప్పగా రాణిస్తున్నారని, ఆస్కార్ అవార్డులు కూడా అందుకుంటున్నారని, ఆవిధంగా విద్యార్థులు  మీ సామర్థ్యాలు మెరుగు దిద్దుకోవాలని  అన్నారు. ముఖ్య వక్త సిర్పా లింగం పాట రచన మెళకువలపై విస్తృతోపన్యాసం చేశారు. పాటలో ఉండే మౌలికమైన అంశాలు,  లక్షణాలు, వ్యక్తీకరించే విధానాలు, సంగీత పరమైన అంశాలతో ఎన్నో రకాల పాటలను ఉదహరిస్తూ విద్యార్థులకు చక్కటి అవగాహనను కలిగించారు. తెలుగు శాఖ అధ్యక్షులు    లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి గేయం,గీతం పాట, బేధాలను, లక్షణాలను   వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల  వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, కార్యక్రమ నిర్వాహకుడు కె.గంగాధర్ తెలుగు అధ్యాపకులు డాక్టర్ శమంత, డాక్టర్  శ్రీనివాస్, రాజేశ్వర్, రాధిక, అర్చన, పీఆర్.ఓ. డాక్టర్  దండుస్వామి, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అకాడమిక్ కోఆర్డినేటర్  నహేద బేగం తదితర  అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.

Awareness of songwriting techniques at Jiji College