Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 5:06 pm Posted by : ramakrishna

రోడ్డు భద్రతపై అవగాహన

మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో బుధవారం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్, రాహుల్,  శ్రీనివాస్, జిల్లా ఐరాడ్ మేనేజర్ వర్షా, నిహాంత్, వసతి గృహ సంక్షేమ అధికారి అశోక్ పాల్గొన్నారు.