ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన
బతుకమ్మ, మోర్తాడ్:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని ప్రజల కోసం చేసిన పథకాల గురించి ఆదివారం శేట్ పల్లీ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ స్థానికులకు కాంగ్రెస్ పార్టీ మండల యువ జన అధ్యక్షుడు అడవుల మనోజ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రజా పాలన విజయోత్సవాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, వరి పంటకు రూ.500 బోనస్ ఇవ్వడం ద్వారా రైతులు ఆనందంగా...