Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 6:47 pm Posted by : ramakrishna

ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన

బతుకమ్మ, మోర్తాడ్:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి మొదటి సంవత్సరం పూర్తిచేసుకుని ప్రజల కోసం చేసిన పథకాల గురించి ఆదివారం శేట్ పల్లీ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ స్థానికులకు కాంగ్రెస్ పార్టీ మండల యువ జన అధ్యక్షుడు అడవుల మనోజ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రజా పాలన విజయోత్సవాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, వరి పంటకు రూ.500 బోనస్ ఇవ్వడం ద్వారా రైతులు ఆనందంగా ఉన్నారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించి రూ. వేలకోట్ల ఆదా చేశామని అన్నారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం చేసిందని అన్నారు. రానున్న నాలుగేళ్లలో ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ రంజిత్, పార్టీ నాయకులు బద్దం దేవేందర్, సుంకే శ్రీకాంత్, బబ్బురి నవీన్, బద్దం అజయ్ తదితరులు పాల్గొన్నారు.