పోషక ఆహారం పై అవగాహన
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఈసీసీఈ రోజున ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ సుమలత మాట్లాడుతూ పిల్లలకు అందియవలసిన పోషకాహారం పై అవగాహన కల్పించారు. అలాగే ప్రతి నెల పిల్లల బరువులు, ఎత్తు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను సరి చూడడం జరుగుతుందని పేర్కొన్నారు. గర్భిణీలు తీసుకోవలసిన ఆహార నియమాల గురించి వివరించారు. కార్యక్రమంలో పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.