Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 4:22 pm Posted by : ramakrishna

యువతకు ఆర్థిక విద్యపై అవగాహన

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువతకు ఆర్థిక విద్య అవగాహన కల్పించుటకై వర్క్ షాప్, సర్టిఫికెట్ కార్యక్రమంను కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న ప్రారంభించారు. రెండు రోజులపాటు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ సిటిజన్ శీర్షికన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ ముంబై రూపకల్పనలో  కోటాక్ సెక్యూరిటీ లిమిటెడ్ సౌజన్యంతో (ఐక్యూ ఏసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెబీ మార్కెట్ సెక్యూరిటీస్ ట్రైనర్ డాక్టర్  అసిస్టెంట్ ప్రొఫెసర్ బాల చంద్రం రిసోర్స్ పర్సన్ గా పెట్టుబడులు ఎలా ఏ సమయంలో ఎక్కడ చేయాలి ఆర్థికవృద్ధి లాభాలు ఎలా సాధించాలి అనే అంశాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సందేహాలను నివృత్తి చేశారు. షేర్ మార్కెట్లో ద్రవయోల్బణం ఆదాయ వేయాల రేట్ల గురించి కుల కషాంగ తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి, డాక్టర్ యు దశరథ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Awareness of financial education for youth