మృత్తికపై రైతులకు అవగాహన

బతుకమ్మ,మోర్తాడ్: ప్రపంచ మృత్తిక (నేల ) దినోత్సవం సందర్బంగా వ్యవసాయ శాఖ మోర్తాడ్ మండలం అధ్యర్యంలో గురువారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు భూమి ఆరోగ్యం మట్టిలో సూక్ష్మ జీవుల ప్రాముఖ్యత, మట్టి సంరక్షణ, సేంద్రియ ఎరువుల వినియోగం, పచ్చి రొట్ట ఎరువుల ఆవశ్యకత వంటి అంశాలపై అవగాహనా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ ఆదికారి హరీష్ కుమార్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీలత, లకపతి, మహేష్ రైతులు రాజేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.