విద్యార్థులకు విద్యుత్ భద్రతపై అవగాహన
పోతంగల్, బతుకమ్మ : విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం భద్రత సూచనలు పాటిద్దాం అని రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ పేర్కొన్నారు. పోతంగల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొతంగల్ పాఠశాల విద్యార్థులకు విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటి డాబాలపై వైర్లు కట్టి బట్టలు ఆరేయకూడదన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని తెలిపారు. వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ చెట్టు కొమ్మలను తాకరాదన్నారు. విద్యుత్ షాక్ తలిగిన వ్యక్తిని రక్షించాలని ఆత్రుతతో ఆ...