Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 October 2025, 7:16 pm Posted by : ramakrishna

విద్యార్థులకు విద్యుత్ భద్రతపై అవగాహన

పోతంగల్, బతుకమ్మ : విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం భద్రత సూచనలు పాటిద్దాం అని రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ పేర్కొన్నారు. పోతంగల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొతంగల్ పాఠశాల విద్యార్థులకు విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటి డాబాలపై వైర్లు కట్టి బట్టలు ఆరేయకూడదన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని తెలిపారు. వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ చెట్టు కొమ్మలను తాకరాదన్నారు. విద్యుత్ షాక్ తలిగిన వ్యక్తిని రక్షించాలని ఆత్రుతతో ఆ వ్యక్తిని ముట్టుకోవద్దని, కర్రలను వాడాలని తెలిపారు. విద్యుత్ పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడండి, గదిలో ఎవరు లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఆర్పేయాలని తెలిపారు. నాణ్యమైన ఐఎస్ఐ మార్కు గల వస్తువులను వాడాలని, ఎయిర్ కండీషనర్స్ 25 డిగ్రీస్ వద్ద అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయాలని సూచించారు. తడి బట్టలను ఐరన్ చేయకూడదని, ఒక్క యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే జీవితంలో ఒక లక్ష రూపాయలు పొదుపు చేసినట్టని తెలిపారు. ఇంటిలో తప్పకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, దాంతో భూగర్భ జల మట్టం పెరిగి బోరు మోటారు విద్యుత్ వాడకం తగ్గించుకోవచ్చని తెలిపారు. మీకు ఎలాంటి విద్యుత్తు సమస్యకైనా 1912 కాల్ చేసి తక్షణ విద్యుత్ సహాయాన్ని పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పొతంగల్ ఏ ఈ ఫక్రుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీవాణి  నాగనాథ్, ఇందిరా ప్రియదర్శిని స్థానిక విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Awareness of electrical safety for students