Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2025, 6:42 pm Posted by : ramakrishna

సైబర్ నేరాలపై అవగాహన

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ప్రాథమిక స్థాయి మౌలిక భాషా, గణిత సామర్థ్యాలపై 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మండల విద్యా అధకారి కోర్సు డైరెక్టర్ కట్టా శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలోనిర్వహిస్తున్నారు.  ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా చివరి రోజున రుద్రూర్ ఎస్సై పి.సాయన్న  సిబ్బంది  కలిసి సైబర్ నేరాలు,  షీటీం పై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల ప్రాథమిక ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు తదితరులు పాల్గొన్నారు.