సైబర్ నేరాలపై అవగాహన
బతుకమ్మ, బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని గోపన్ పల్లి గ్రామంలో గురువారం సైబర్ నేరాలపై బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్లో ఓటీపీ చెప్పవద్దని అన్నారు. మీకు బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము డబ్బులు మీ అకౌంట్లో జమవుతాయి ఓటిపి చెప్పండి అని కాల్ చేసిన వారికి ఓటీపీ, ఆధార్ కార్డు నెంబర్ చెప్పవద్దని పోలీసులు యువకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై మోహన్ రెడ్డి తో పాటు హోంగార్డులు రాములు, మారుతి తదితరులు...