బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని బస్టాండ్ లోమోర్తాడ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రయాణికులకు షీ టీం, సైబర్ నేరాల మోసాలపై హెడ్ కానిస్టేబుల్ శంకర్ ప్రయాణికులకు అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళాల, యువతుల సంరక్షణకై షీ టీం ను అమలు చేస్తుందన్నారు. మహిళాలపట్ల పోకిరిలు ఎవరైనా వేధిస్తే వెంటనే సి టీంకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే పోలీసో సకాలంలో వచ్చి రక్షిస్తారని కేసులు నమోదు చేస్తారని కఠినమైన శిక్షలు అమలు చేస్తారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఎవరికైనా లక్కీ డ్రా పలికిందని లేదా స్కీముల్లో మీకు డబ్బులు వచ్చాయని, బ్యాంకు ఓటీపీ చెప్పమని మెసేజ్లు పెట్టిన బ్యాంక్ ఖాత ఓటీపీలు మాత్రం చెప్పవద్దని ప్రయాణికులకు తెలియజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, పృథ్వీరాజ్, కంట్రోలర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.