Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2024, 6:35 pm Posted by : ramakrishna

మహా సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు అవగాహన

బతుకమ్మ, పిట్లం : పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో శుక్రవారం జై భవాని ట్రేడర్స్ ఆధ్వర్యంలో మహా సిమెంట్ పై మేస్త్రీలకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన భవనం కట్టడంలో మేస్త్రీలకు మెలకువలను తెలియజేశారు. సిమెంట్, ఇసుక, కంకర, నీళ్లు కలుపు మోతాదులను, గాలి తొలగించే విధానాన్ని వివరించారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న సిమెంట్ బస్తాలని ఉపయోగించాలని, వాటర్ క్యూరింగ్ చేసే పద్ధతిని తెలిపారు. సరి పాలలో సిమెంట్, ఇసుక, కంకర, నీళ్లు కలుపు మోతాదును వివరించారు. అదనంతరం మేస్త్రీలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ సేల్స్ మేనేజర్ సిసింద్రీ. టెక్నికల్ మేనేజర్ నవీన్ మేస్త్రిలు ఉన్నారు.