Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2025, 5:09 pm Posted by : ramakrishna

గురుకుల పాఠశాల విద్యార్థినిలకు అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల విద్యార్థినులకు అవగామన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ మాట్లాడుతూ మారుతున్న జీవన విధానం లో ఆయుర్వేద ప్రాధాన్యతను దిన చర్య ఋతు చర్య జీవన విధానం లో మార్పులు.. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల ప్రాధాన్యతలు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. మన చుట్టూ ప్రక్కల లభించే ఔషద మొక్కల ప్రాధాన్యత.. డెంగ్యూ చికెన్ గున్యా మలేరియా వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురుంచి వివరించారు. యోగ వైద్యులు డాక్టర్ తిరుపతి విద్యార్థినులకు యోగ ప్రాముఖ్యత ప్రాణాయామం యోగా వలన కలిగే లాభాలు అన్నిటికీ ఆసనాలు వేయించారు. ఆరోగ్య పరిరక్షణలో యోగ సాధన ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మకుమారి, ఆయుష్ ఫార్మ సిస్స్ట్స్ లు స్యవనంది పురుషోతం, ఉమా ప్రసాద్, యోగ శిక్షకుడు రాజేందర్, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు, స్టాఫ్ నర్సు సంద్య, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Awareness for female students of Gurukul schools