.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు
..ఎస్సై జి సందీప్
ఇందల్వాయి,బతుకమ్మ :
ఉందల్వాయి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఎస్సై జి సందీప్ ‘అరైవ్ అలైవ్ ’కార్యక్రమం ద్వారా డ్రైవర్లకు,ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై జి సందీప్ మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని సూచించారు. డ్రైవర్లు ఆటోలలో ప్రయాణికులను మోతాదుకు మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు.
అరైవ్ అలైవ్ అనేది ఒక నినాదం కాదు-ఉద్యమంలా సాగాలన్నారు. ప్రతీ కుటుంబం ఆనందంతో జీవించాలన్నారు.
హెల్మెట్ చట్టం కాదు- ప్రాణాన్ని కాపాడే ఆయుధం విధిగ దరించండి అని తెలిపారు.
మంగళవారం 13 జనవరి 2026 నుండి శనివారం 24 జనవరి 2026 వరకు ఈ ‘అరైవ్ అలైవ్ ’ అవగాహన కార్యక్రమాలు
దేశములో నే మొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డీజీపీ రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా (అరైవ్ అలైవ్) అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.ఈ అరైవ్ అలైవ్ అనే ఒక నినాదం కాకుండా అందరిలో రోడ్డు ప్రమాదాలు నివారించే ఒక ఉద్యమంలా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలనే వారి కుటుంబ సబ్యుల ఆశను తీర్చే కార్యక్రమం కావాలన్నారు.రహదారి భద్రత నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ఉన్నదని తెలిపారు.రోడ్డు ప్రమాదాలు మన నిర్లక్ష్యం, అతివేగం, అజాగ్రత్త వల్ల జరుగుతాయి.హెల్మెట్ ధరించడం అనేది కేవలం చలాన్లు చట్టం నుండి తప్పించుకోవడానికి కాదు అది మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధం అని ప్రతీ ఒక్క వాహనదారుడు గ్రహిచాలి.
మద్య సేవించి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాద మరణాలు జరిగి ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు.ఆటో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు.మొబైల్ వాడకం,ఓవర్ స్పీడ్,రాంగ్ దిశలో డ్రైవింగ్ ఎట్టి పరిస్తితులలో చేయవద్దని సూచించారు. సేఫ్టీ ఫస్ట్ — మీ కోసం మీ కుటుంబ సబ్యులు ఇంటి వద్ద ఎదురుచూస్తున్నారు అన్న విషయం గుర్తించుకొని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించండి అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి సందీప్ ఎస్సై జి సందీప్, సిబ్బంది గంగా కిషన్,రఘు,ఆటో డ్రైవర్లు, ప్రయాణిక ప్రజలు పాల్గొన్నారు.
