ఉద్యోగ కల్పన, నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో సోమవారం విద్యార్థులకు భవిష్యత్తులో వారికి ఉద్యోగ కల్పన, ఇందుకు సంబంధించి నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు తెలిపారు. తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో దేశ్పాండే ఫౌండేషన్, స్కిల్ ప్లస్ ప్రోగ్రాం, వర్క్ షాప్ ఆన్ క్యాంపస్ టు కార్పొరేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంపైబిలిటీ తృతీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.