Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 3:53 pm Posted by : ramakrishna

జీ ఎస్ పి కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

బతుకమ్మ,ఏర్గట్ల : మండల కేంద్రంలోని తోర్తి గ్రామంలో శనివారం జి ఎస్ పి కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో ప్రధాన సమస్య అయిన కత్తెర పురుగు, కాండం తొలిచుపురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జి ఎస్ పి కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్థర్ అనే మందు గుళికలు మొక్కజొన్న పంటలో ప్రధానమైన సమస్య  కత్తెర పురుగు,కాండం తోలుచు పురుగును సమర్థవంతంగా అరికడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కంపెనీ జోనల్ మేనేజర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ మార్కెట్లో దొరికే ఇతర పురుగు మందులతో పోలిస్తే ఇది చాలా రేట్లు తొందరగా పనిచేస్తుందని,  ఎక్కువ రోజులు కత్తెర పురుగు సోకకుండా పంటకు రక్షణ కల్పిస్తుందని అన్నారు. రిజినల్ మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడుతూ ఈ మందు ఎకరానికి 4 కేజీల చొప్పున రైతులు మొక్క జొన్న పంటలో వాడుకోవాలని అన్నారు. ఈ ఆర్థర్ అనే గుళికలను మొక్కజొన్న పంట సుడిలో వేయడం వలన కొన్ని నిమిషాల వ్యవధిలోనే పురుగు చనిపోవడం జరుగుతుందని, పంట కోత దశ వరకు పురుగు ఆశించకుండా రక్షణ ఇస్తుందని తెలిపారు. కంపెనీ టెర్రిటరీ మేనేజర్ ఆశన్న మాట్లాడుతూ రైతులు వ్యవసాయ క్షేత్రాలలో పురుగుమందులు వాడే సమయంలో చేతులకు గ్లౌజులు,ముఖానికి మాస్క్, పిచికారి అనంతరం చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని,రైతులకు జాగ్రత్తలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ పి కంపెనీ ప్రతినిధులు జోనల్ మేనేజర్ జీవన్ కుమార్,రీజినల్ మేనేజర్ శ్రీనాథ్,తెర్రిటరీ మేనేజర్ ఆశన్న రైతులు తదితరులు పాల్గొన్నారు.