Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2025, 6:24 pm Posted by : ramakrishna

డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలంలోని దూదిగాం, చాకిర్యాల్ గ్రామాలల్లో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు వరి తడి,పొడి సాగుపై కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వంశీకృష్ణ అవగాహన కలిపించారు. వరి పంటకు నీరు అవసరం కాని వరి నీటి పంట కాదని క్షేత్ర స్థాయిలో అవగాహనతో పాటు రైతులకు ఏడబ్ల్యూడీ పైపులను ఉచితంగా అందచేశారు. తడి పొడి విధానం ద్వారా 15%నుండి 30% వరకు అధికదిగుబడిని సాధించవచ్చని అయన రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Awareness conference for farmers under the auspices of Dr. Reddy's Foundation