Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 5:31 pm Posted by : ramakrishna

రైతులకు అవగాహన సదస్సు

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల బాబు జగ్జీవన్ రాయ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో రైతులకు సోమవారం అవగాహన సదస్సు కల్పించారు. వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి అరుణ్ బాబు మాట్లాడుతూ విత్తనం- రైతన్నకు నేస్తం  అనే కార్యక్రమం ఏర్పాటు చేశామని నాణ్యమైన విత్తనాన్ని సాగు చేస్తే పంట దిగుబడి 10 నుండి 15% పెంచవచ్చన్నారు. రైతులకు పంట రకాల పైన పంట చీడ పురుగుల పైన రైతులకు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి నరేంద్ర విస్తరణాధికారులు వినోద్ ,లిఖిత్ ,మౌనిక  గ్రామ రైతులు పాల్గొన్నారు.

Awareness conference for farmers